America | ఎర్రసముద్రంలో హౌతి డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసిన అమెరికా
America | అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు, ఐదు మిస్సైల్స్‌ను ఎర్రసముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్రసముద్రం ప్రాంతంలో నౌకలకు ఎలాంటి నష్టం జరుగలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.
America | అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు, ఐదు మిస్సైల్స్‌ను ఎర్రసముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్రసముద్రం ప్రాంతంలో నౌకలకు ఎలాంటి నష్టం జరుగలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో క్రూయిస్ క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. దక్షిణ ఎర్రసముద్రంలో హౌతీ దాడులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 26న ఉదయం 6.30 గంటలకు (యెమెన్ స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు మొదలై.. పది గంటల వరకు కొనసాగాయి.
దక్షిణ ఎర్ర సముద్రంలో షిప్పింగ్‌కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటుంది. ఎల్ మండేబ్ జలసంధి అత్యంత సున్నిత ప్రాంతం. ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ నౌకలపై దాడులకు దిగుతున్నది. ఇజ్రాయెల్ నౌకలను హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ నౌకల వైపు వస్తున్న ‘శత్రు వైమానిక లక్ష్యాన్ని’ కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. వైమానిక లక్ష్యాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుర్తించిందని పేర్కొన్నారు. గాజాకు సంఘీభావంగా ఐలాట్‌లో డ్రోన్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. హౌతీ దాడిని ‘ఉగ్రవాద చర్య’గా హగారీ అభివర్ణించారు. ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం తీరంలో జరిగిన అంతరాయానికి సంబంధించిన ఫుటేజీని సైతం విడుదల చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

