టిరానే: ప్రపంచంలో తొలిసారి కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే వ్యవస్థకు ‘మంత్రి’ (AI Minister) హోదా కల్పించిన అల్బేనియా.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఏఐ మంత్రి ‘డియెల్లా’ గర్భవతి అయ్యిందని, 83 మంది పిల్లలకు తల్లి కాబోతున్నదని అల్బేనియా (Albania) ప్రధాని ఇడి రామ తాజాగా ఓ వింత ప్రకటన చేశారు. పార్లమెంట్లో సోషలిస్ట్ పార్టీకి చెందిన ప్రతి సభ్యునికి ఒకరు చొప్పున ‘83 మంది సహాయకుల’ను తీసుకొస్తున్న ప్రణాళికను ఆయన పై విధంగా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్లో నియామకమైన ఏఐ ఆధారిత మంత్రిని సాంప్రదాయ అల్బేనియన్ మహిళా దుస్తుల్లో ఉన్న మహిళగా చూపిస్తున్నారు.