Afghanistan : ఆ రెండు గ్రూపులను పెంచకండి: తాలిబాన్‌కు ఆరు దేశాల సూచన
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్‌కు పొరుగున ఉన్న ఆరు దేశాలు ముఖ్య సూచన చేశాయి. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖాయిదాలను పెంచడాన్ని నిరోధించాలని తాలిబాన్‌కు...

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్‌కు పొరుగున ఉన్న ఆరు దేశాలు ముఖ్య సూచన చేశాయి. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖాయిదాలను పెంచడాన్ని నిరోధించాలని తాలిబాన్‌కు సూచించారు. పాకిస్తాన్లో ఆరు దేశాల విదేశాంగ మంత్రులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆ మరుసటిరోజు ఈ మేరకు ఈ ప్రకటనను సంయుక్తంగా జారీ చేశారు. తాలిబాన్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఉత్తమమని, అలాకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో దాయిష్, అల్ ఖాయిదా పట్టు సాధించేందుకు అనుమతించవద్దని వారు ఆ సంయుక్త ప్రకటనలో కోరినట్లు టోలో న్యూస్ నివేదించింది. తాలిబాన్ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఇలా ప్రకటన రావడం ఇదే మొదటిది.
మితవాద విధానాలను అవలంబించాలని తాలిబాన్‌కు ఆరు దేశాలు కోరాయి. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశాల పట్ల స్నేహపూర్వక విధానాలను అవలంబించడం, భాగస్వామ్య లక్ష్యాలను సాధించడం, శాంతి, భద్రతలు, దీర్ఘకాలిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిపాలించడం అలవర్చుకోవాలని ప్రకటనలో పేర్కొన్నాయి. మహిళలు, పిల్లలతో పాటు ప్రాథమిక మానవ హక్కులను గౌరవించాలని ఆరు దేశాలు ఆఫ్ఘన్‌ను కోరాయి. ఆఫ్ఘనిస్తాన్ గడ్డ మీది నుంచి ఏ ఉగ్ర సంస్థలు కూడా కార్యకలాపాలు నెరపకుండా చూడాలని సూచించాయి. ఈ ఆరు దేశాల సమావేశాలు రొటేషన్ పద్ధతిన నిర్వహస్తున్నామని, తదుపరి సమావేశం టెహరాన్‌లో జరుగుతుందని కూడా ఆ ప్రకటనలో తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
నందిగ్రామ్‌లో మాదిరిగానే భబానీపూర్‌లో గెలుస్తాం: షానవాజ్ హుస్సేన్
ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఫిర్యాదు
ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ
కర్నల్ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం
18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

