Prince Andrew : ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఫిర్యాదు
Prince Andrew : బ్రిటన్ యువరాజు ఆండ్రూపై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు ఆయనకు లైంగిక వేధింపుల లీగల్ పత్రాలను...

న్యూయార్క్ : బ్రిటన్ యువరాజు ఆండ్రూపై (Prince Andrew) లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు ఆయనకు లైంగిక వేధింపుల లీగల్ పత్రాలను అందజేశారు. యుక్తవయసులో ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ దాఖలు చేసిన చట్టపరమైన పత్రాల్లో ఆరోపించింది. న్యూయార్క్ దక్షిణ జిల్లాలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, గత నెల 27 న ఇంగ్లండ్‌లోని విండ్సర్లోని రాజసౌధంలో ఫిర్యాదు అందజేసినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో తొలి విచారణను సోమవారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆండ్రూ అధికార ప్రతినిధి నిరాకరించారు.
వర్జీనియా గిఫ్రే అనే మహిళ.. తనను 2019 లో సెక్స్ కోసం బ్రిటన్ యువరాజు ఆండ్రూకు అప్పుగా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టెయిన్ ఇచ్చాడని తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఫైనాన్షియర్ జెఫ్రీ ఎఫ్స్టెయిన్ 2019 లో న్యూయార్క్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏండ్ల క్రితం తాను 18 ఏండ్ల కన్నా తక్కువ వయసులో ఉన్నప్పుడు లండన్ సోషియల్ జిస్లైన్ మాక్స్వెల్ ఇంట్లో తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఎప్స్టెయిన ఇంటితోపాటు వర్జిన్ దీవుల్లోని లిటిల్ సెయింట్ జేమ్స్ దీవిలో కూడా ఆండ్రూ తనను దుర్భాషలాడారని గిఫ్రే పేర్కొన్నది. అయితే, ఇదంతా అభూతకల్పన అని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఎప్పుడూ కలువలేదని యువరాజు ఆండ్రూ తేల్చిచెప్పారు. ఆమె చేస్తున్న ఆరోపణలతో బ్రిటన్ రాజ కుటుంబం పరువుకు భంగం కలిగిందని ఆయన అన్నారు.
ప్రిన్స్ ఆండ్రూ విడాకులు తీసుకున్న ఇద్దరు పిల్లలకు తండ్రి. రాయల్ నేవీ హెలికాప్టర్ మాజీ పైలట్. 1982 లో అర్జెంటీనాపై జరిగిన ఫాల్క్ ల్యాండ్స్ యుద్ధంలో పాల్గొన్న ఆండ్రూ.. 2019 చివరిలో ఫ్రంట్ లైన్ రాయల్ విధుల నుంచి వైదొలగవలసి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో.. ఎప్స్టెయిన్తో తన స్నేహాన్ని సమర్ధించుకున్న ఆండ్రూ.. అతడికి లెక్కలేనంత మంది ప్రముఖులు స్నేహితులుగా ఉన్నారని చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి..
ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ మూడో సమన్లు జారీ
కర్నల్ లాఠీఛార్జీపై విచారణకు హర్యానా ప్రభుత్వం ఆదేశం
18 ఏండ్లలో తొలిసారి 1000 మి.మీ వర్షపాతం
తీవ్రవాదంపై యుద్ధానికి రూ.585 లక్షల కోట్లు ఖర్చు
ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
బెంగళూరులో ‘అప్పికో ఉద్యమం’.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

