తాష్కెంట్: ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మిలిటరీ విమానం ఉజ్బెకిస్థాన్‌లో కూలిపోయింది ( Plane crash ). ఈ విషయాన్ని ఉజ్బెకిస్థాన్ రక్షణ శాఖ ఇవాళ ధృవీకరించింది. ఆదివారం మిస్సయిన ఆఫ్ఘనిస్థాన్ మిలిటరీ విమానం కూలిపోయి ఉంటుందని ఇప్పటికే మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆ కథనాలు వాస్తవమేనని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ధృవీకరించింది.
‘ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మిలిటరీ విమానం అక్రమంగా మా సరిహద్దు దాటి వచ్చింది. ఈ ఘటనపై మేం దర్యాప్తు చేస్తున్నాం’ అని ఉజ్బెకిస్థాన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి బఖ్రోం జుల్ఫికరోవ్ మీడియాకు వెల్లడించారు. ఆప్ఘనిస్థాన్ సరిహద్దుని ఆనుకుని ఉన్న ఉజ్బెకిస్థాన్ దక్షిణాది ప్రావిన్స్ సర్ఖోండార్యోలో ఆదివారం అర్థరాత్రి మిలిటరీ విమానం కూలిపోయి ఉంటుందంటూ ఉజ్బెక్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమేనని ఆ దేశ సర్కారు స్పష్టంచేసింది.