లాహోర్: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న ఆగస్ట్ 14నే లాహోర్‌లో దారుణం జరిగింది. టిక్‌టాక్ ( Pakistan TikToker ) వీడియోలు చేసే ఓ మహిళపై ఒకేసారి వందల మంది దాడి చేశారు. ఆమె బట్టలు చించేశారు. గాల్లోకి ఎగరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వాతంత్ర్య దినోవ్సం రోజున పార్క్‌లో వందల మంది పురుషులు తనను చుట్టుముట్టి దాడికి పాల్పడినట్లు ఆ మహిళ వెల్లడించింది. ఈ వీడియో బయటకు రావడంతో ఈ దారుణమైన ఘటన గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ఘటనపై లారీ అడ్డా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పాక్ పత్రిక డాన్ వెల్లడించింది.
మినారె పాకిస్థాన్ దగ్గర తనతోపాటు తన ఆరుగురు స్నేహితులతో వీడియో తీస్తున్న సమయంలో 300 నుంచి 400 మంది తమపై దాడి చేసినట్లు ఆ మహిల తన ఫిర్యాదులో పేర్కొంది. తాము తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆమె చెప్పింది. తన దుస్తులు చించి, గాల్లోకి ఎగరేసి దారుణంగా హింసించారని ఆమె తెలిపింది.
Shocking beyond imagination!
— sachin manhas🔥 (@Sachinmanhas10) August 18, 2021
400 men groping,beating & tearing cloth of 1 tiktoker girl in #MinarePakistan
Girl screaming for help.. Azaan going on in the background
These Vultures are no less than Talibanis
This is Naya Pakistan..Shameful pic.twitter.com/IeVi4eezok