మనుషులు, జంతువులు తరచూ చేసే కొన్ని పనులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వినోదాన్ని పంచుతుంటాయి. కొన్నిసార్లు గిన్నిస్ రికార్డులు కూడా బద్దలవుతాయి. తాజాగా అలాంటిదే ఒక వీడియో గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకోవడంతోపాటు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ వారి ఇన్స్టా పేజీలో పోస్ట్ అయిన ఆ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటున్నది.
ఆ వీడియోలో బాలు అనే జర్మన్ జాతి శునకం జర్మనీకే చెందిన తన యజమాని ఓల్ఫ్గాంగ్ లావెన్బర్గర్తో కలిసి స్కిప్పింగ్ ఆడింది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో యజమానితో కలిసి వెనుక కాళ్లతో 32 సార్లు గెంతి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక శునకం వెనుక కాళ్లపై కేవలం 30 సెకన్లలో 32 సార్లు గెంతడం ఇదే మొదటిసారి అని రికార్డ్ బుక్ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 30 లక్షల మంది వీక్షించారు. అంతేగాక 20 వేల మందికిపైగా లైక్ చేశారు. వందలాది మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం కుక్క స్కిప్పింగ్ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించి ఎంజాయ్ చేయండి.