వాషింగ్టన్, ఏప్రిల్ 1: మానసిక అనారోగ్యంతో గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గల సుమారు 5,93,616 మందిపై చేసిన ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
యువత, మధ్యవయస్సు గల వారిలో బలహీనమైన మానసిక ఆరోగ్యానికి, గుండెజబ్బులకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యువత మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడప్పుడు గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.