Malaria | వాషింగ్టన్, జూలై 9: అమెరికాలోని వివిధ రాష్ర్టాల ప్రజల్ని చిన్న దోమ భయపెడుతున్నది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆయా రాష్ర్టాల్లో మలేరియా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ర్టాల్లో మలేరియా వ్యాప్తి పెద్ద ఎత్తున ఉండటంతో ప్రభుత్వ అధికారులు ఆరోగ్య హెచ్చరికలు జారీచేశారు.
వాతావరణ మార్పులు, భూతాపం నేపథ్యంలో 2070నాటికి ప్రపంచవ్యాప్తంగా 470 కోట్ల మంది మలేరియా బారిన పడే ప్రమాదముందని ఒక అధ్యయనం అంచనావేసింది. పర్యావరణ మార్పులు, భూతాపం వల్ల యూరప్, అమెరికాలో మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే అవకాశముందని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి.