నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన విమానం
Aircraft crash | నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానశ్రయంలో
ఖాట్మండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 సీట్ల ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆదివారం ఉదయం పొఖారా అంతర్జాతీయ విమానశ్రయం, పక్కనే ఉన్న పాత విమానాశ్రయం మధ్య విమానం కూలిపోయింది. ఎయిర్‌క్రాఫ్ట్ ఖాట్మండు నుంచి పొఖారా వెళ్తూ ప్రమాదానికి గురైందని, ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని నేపాల్ మీడియా తెలిపింది.
ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారని ఖాట్మండు పోస్ట్ పేర్కొన్నది. ప్రమాదం కారణంగా పొఖారా ఎయిర్‌పోర్టులోకి విమానాల రాకపోకలను నిలిపివేశారని తెలిపింది. కాగా, ప్రమాదం నేపథ్యంలో నేపాల్ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
#WATCH | Visual from Nepal’s Pokhara International Airport where a passenger aircraft crashed earlier today. pic.twitter.com/C8XHL9f7Lu
— ANI (@ANI) January 15, 2023
#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

