బ్రెసిలియా, ఫిబ్రవరి 2: సాధారణంగా బిడ్డలు 2-4 కేజీల మధ్య బరువుతో జన్మిస్తుంటారు. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల 7.3 కేజీల బరువు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. బరువే కాదు.. ఆ శిశువు రెండు అడుగుల పొడవు కూడా ఉన్నది.
అమెజొనాస్ స్టేట్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. క్లీడియాన్ శాంటోస్ అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అధిక బరువుతో జన్మించిన ఈ శిశువు, తల్లీ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.