ఇష్టమైన పనులను ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి. వయస్సు ఎంతైనా మన మెదడుకు ఇంకా అనేక కొత్త కార్యకలాపాల్లో నైపుణ్యం సాధించే అద్భుతమైన సామర్థ్యం ఉంది. కొత్త నైపుణ్యాల వల్ల మన అభిజ్ఞాన ఆరోగ్యం పెరుగుతుంది. కాగా, ఓ వృద్ధుడు మొదటిసారి బౌలింగ్‌కు వెళ్లి ఇంటర్నెట్ను ఆకట్టుకున్నాడు.
ఓ 90 ఏళ్ల వ్యక్తి తన 20 ఏళ్ల వయసులో వెన్నెముక గాయంతో వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకూ బౌలింగ్ చేయలేదు. అతను ఇటీవల ఫిజికల్ థెరపిస్ట్ అయిన తన మనవరాలితో కలిసి తన జీవితంలో మొదటిసారి బౌలింగ్‌కి వెళ్లాడు. వీల్‌చైర్‌లో కూర్చొని ఉల్లాసంగా బౌలింగ్ చేశాడు. ఫుల్ స్కోర్ చేసి, ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లలో స్ఫూర్తిని నింపింది.