90 ఏళ్ల నుంచి అక్వేరియంలోనే ఉన్న చేప.. చూడటానికి ఎగబడుతున్న టూరిస్టులు.. వీడియో

ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు 90 ఏళ్ల నుంచి ఓ చేప అక్వేరియంలో ఉంది. దాని వయసు కూడా 90 ఏళ్లే. ఆ చేప ఎన్ని కిలోలు ఉందో తెలుసా? 18 కిలోలు. 90 ఏళ్ల నుంచి అక్వేరియంలోనే ఉన్న ఆ చేప ఇప్పుడు సెలబ్రిటీ. దాన్ని చూడటానికి టూరిస్టులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ చేప ఎక్కడుంది అంటారా? యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న స్టీన్ హార్ట్ అక్వేరియంలో. ఆ చేప పేరు మెథుసెలా.
ఆస్ట్రేలియా నుంచి 1938లో ఆ చేపను శాన్ ఫ్రాన్సిస్కో మ్యూజియానికి తీసుకొచ్చారట. అప్పటి నుంచి ఆ చేప ఆ అక్వేరియంలోనే ఉందట. ఇప్పుడు ఆ చేప ప్రపంచంలోనే అక్వేరియంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ చేపగా రికార్డుకెక్కింది. కాలిఫోర్నియా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ స్టీన్హార్ట్ అక్వేరియంలో ఉన్న ఆ చేపను చూసేందుకు టూరిస్టులు మాత్రం క్యూ కడుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన లంగ్ ఫిష్.. ఇలాగే అక్వేరియంలో 95 ఏళ్లు జీవించి ఉంది. కానీ.. అది 2017లో చనిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ టైటిల్‌ను మెథుసెలా దక్కించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

