పెషావర్: పాకిస్థాన్(Pakistan)లోని ఖైబర్ ఫుక్తునక్వా ప్రావిన్సులో పేలుళ్ల ఘటన జరిగింది. బన్నూ జిల్లాలోని మర్కా బేరే ఏరియాలో రోడ్డుపై నాటిన ఐఈడీ బాంబులు పేలాయి. ఈ ఘటన ఏడు మంది మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా పేలుళ్లకు బాధ్యత ప్రకటించలేదు. బన్నూ జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ.. రోడ్డుపై నాటిన ఐఈడీ పేలడం వల్ల ఓ వ్యాన్లో వెళ్తున్న వారిలో అయిదు మంది మృతిచెందారు. రెస్క్యూ మిషన్లో భాగమైన మరో వాహనం కూడా ఐఈడీ పేలుడుకు లోనైట్లు పోలీసు అధికారి చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతుల దేహాలను, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. హాథీ కేల్ గ్రామం నుంచి బన్నూ సిటీకి వెళ్తున్న ప్రయాణికుల వ్యాన్ను టార్గెట్ చేస్తూ ఐఈడీ పేలుడు జరిగింది.ఆ ప్రాంతాన్ని సెక్యూర్టీ దళాలు, పోలీసులు చుట్టుముట్టారు. బ్లాస్ట్ సైట్ నుంచి ఆధారాలను సేకరించారు. సీఎం సోహేల్ అఫ్రిదీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.