న్యూయార్క్, జూలై 16: అమెరికాలోని అలస్కాలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైంది. అలస్కా పరిధిలోని పెనిన్సులా ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది. దీంతో జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూకంప కేంద్రం 9.3 కి.మీ లోతులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.