Oxygen plant | ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, 30 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లోని (Bangladesh) చిట్టగాంగ్‌లో (Chittagong) పేలుడు సంభవించింది. చిట్టగాంగ్ సమీపంలోని కేశవ్‌పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంటులో (Oxygen plant) ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు (Explosion) సంభవించింది.
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌లోని (Bangladesh) చిట్టగాంగ్‌లో (Chittagong) పేలుడు సంభవించింది. చిట్టగాంగ్ సమీపంలోని కేశవ్‌పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంటులో (Oxygen plant) ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు (Explosion) సంభవించింది. దీంతో ఆరుగురు మరణించగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడువ ల్ల ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, పేలుడు ధాటికి ఆక్సిజన్ ప్లాంట్‌కు రెండు చదరపు కిలోమీటర్ల వరకు బిల్డింగ్లు ప్రభావితమయ్యాయాని స్థానికులు వెల్లడించారు. అదేవిధంగా ఇనుప వస్తువులు పెద్దమొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయని తెలిపారు.

ఇక శనివారం ఉదయం ఇండోనేషియా రాజధాని జకార్తలో (Jakarta) ఉన్న ఓ చమురు డిపోలో (Fuel storage depot) పేలుడు సంభవించింది. దీంతో 16 మంది దుర్మరణం చెందారు. మరో50 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పెర్టమినా (Pertamina) ఆయిల్ డిపోలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అధికారులు నివాసప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

