రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్!
రష్యాను ఏ రకంగానూ లొంగదీసుకోలేకపోతున్న అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర దేశాలపై బెదిరింపులకు దిగుతున్నది.
- చట్టం రూపొందిస్తున్నట్టు ట్రంప్ వెల్లడి
న్యూయార్క్, నవంబర్ 17: రష్యాను ఏ రకంగానూ లొంగదీసుకోలేకపోతున్న అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర దేశాలపై బెదిరింపులకు దిగుతున్నది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ‘అతి తీవ్రమైన ఆంక్షలు’ విధిస్తామని హెచ్చరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు మాస్కోను లక్ష్యంగా చేసుకొని రిపబ్లికన్ ప్రజాప్రతినిదులు ఒక కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. రష్యా, దాని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికన్ కాంగ్రెస్ ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా? అన్న ప్రశ్నకు అధ్యక్షుడు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘రిపబ్లికన్లు ఓ చట్టాన్ని రూపొందించనున్నారు.
అది నాకు సమ్మతమే. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అతి తీవ్రమైన ఆంక్షలు విధించనున్నారు. ఇరాన్‌ను కూడా జతచేయమని నేను చెప్పాను’ అని అన్నారు. రష్యాతోపాటు ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా మరిన్ని కఠిన ఆంక్షలకు దిగనున్నది. ఈ మేరకు సెనెటర్ లిండ్సే గ్రాహం సెనేట్ విదేశీ సంబంధాల కమిటీకి ప్రతిపాదించిన బిల్లు ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించే దేశాలపై 500 శాతం టారిఫ్ విధించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

