దోహా, నవంబర్ 16: ఆ స్టేడియంను ఎక్కడికి పడితే అక్కడికి మోసుకెళ్లవచ్చు. అలాగని అది వందో, రెండువందల మందో కూర్చునే బుల్లి స్టేడియం కాదు. 40 వేలమంది కూర్చునేందుకు వీలున్న భారీ స్టేడియం. ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ దీనిని తయారు చేసింది. వాడేసిన షిప్పింగ్ కంటెయినర్లతో తయారు చేసిన దీనికి ‘స్టేడియం 974’ అని పేరుపెట్టారు. ఆ నంబరు ఎందుకు అంటే అది ఖతార్ ఐఎస్డీ కోడ్. అంతేకాదు 974 కంటెయినర్లతో అది తయారైంది. ఈ మొబైల్ స్టేడియంను విడగొట్టి ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. వరల్డ్ కప్ తర్వాత దీనిని ముక్కలుగా విడదీసి వేరే చోటికి తరలిస్తారట.