Pakistan | బలూచిస్తాన్‌లో లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి.. 8 మందికి గాయాలు
Pakistan : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది.
Pakistan : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా పర్వతాలు కలిగిన రోడ్డులో ప్రమాదం జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకుని హైవేపై వెళ్తోంది. ఇది సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాలను కలిపే రోడ్డు.
అయితే, ఈ రోడ్డు చాలా ప్రమాదకరం. పర్వత ప్రాంతం కావడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా నిలిచింది. అలాంటి ప్రదేశంలో పర్వత మార్గంలో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుల, రెస్క్యూ, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. బస్సు శిథిలాల నుంచి 40 మంది మృతదేహాల్ని వెలికితీశారు. గాయపడ్డవారిని స్థానిక ఝోబ్ పట్టణంలోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద స్తలంలో అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వైద్యబృందం, లైట్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు.
అయితే, పర్వత ప్రాంతం, పెద్ద లోయ కావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ అంశంపై షెరాణి డిప్యూటీ కమిషనర్ హజ్రత్ మాట్లాడారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బస్సు మొదట 36 మందితోనే బయల్దేరిందని, అయితే, మార్గమధ్యలో మరికొందరు ప్రయాణికుల్ని ఎక్కించుకుందన్నారు. అందువల్లే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
KTR | ‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసల వర్షం.. చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానంటూ కామెంట్స్!
Layoffs | భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైన మరో టెక్ దిగ్గజం.. SAPలో 10 వేల ఉద్యోగాలకు కోత?
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

