అబుదాబి: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లతోసహా నలుగురు మరణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఈ ఘటన జరిగింది. ఎమిరేట్స్ పోలీస్‌కు చెందిన ఎయిర్ అంబులెన్స్ హెలీకాప్టర్ శనివారం కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలెట్లతోపాటు ఒక డాక్టర్, ఒక నర్సు చనిపోయారు. అయితే అబుదాబి పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. సంఘటన ఎక్కడ జరిగింది, కారణం ఏమిటి అన్నది ఇంకా ప్రకటించలేదు.