పాక్ జైళ్లలో 308 మంది భారతీయులు
పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్‌కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు.
ఇస్లామాబాద్, జూలై 2: పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్‌కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ వివరాలను భారత్‌తో పంచుకున్నట్టు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. శిక్ష పూర్తి చేసుకున్న 254 మంది మత్స్యకారులతో పాటు, నలుగురు పౌరులను వెంటనే విడుదల చేయాలని భారత్ పాకిస్థాన్‌ను కోరింది.
కాగా పాక్‌లో ఉన్నట్టే భారత్‌లో కూడా 417 మంది పాకిస్థానీలు వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. భారత్‌లో శిక్షా కాలం పూర్తి చేసుకున్న తమ దేశస్థులను విడుదల చేయాలని పాకిస్థాన్ కూడా భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కాగా, గతంలో చేసుకున్న ఒప్పం దం ప్రకారం ఇరు దేశాలు ఖైదీల వివరాల జాబితాను పంచుకుంటున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

