Rishi Sunak | ఇప్పటివరకు ప్రపంచంలోని మేటి కార్పొరేట్ సంస్థలకు అధిపతులుగా భారత సంతతి నిపుణులు సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలోని రాజకీయ నేతలు కూడా వస్తారు. అమెరికా నుంచి పోర్చుగల్ వరకు పలు దేశాల్లో భారత సంతతి రాజకీయ వేత్తలు కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఆ జాబితాలోకి మన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ చేరారు. బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ అభ్యర్థిత్వం ఏకగ్రీవం అయ్యారు. పెన్నీ మోర్డాంట్‌కు కేవలం 27 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉండటంతో రిషి సునాక్ ఎన్నిక నల్లేరు మీద నడకే అయ్యింది. వివిధ దేశాలకు అధినేతలుగా ఉన్న భారత సంతతి రాజకీయ నాయకుల జాబితాలో ఆయన జత కలిశారు.. ఇప్పటి వరకు ప్రధాన పాత్ర పోషిస్తున్న ముగ్గురు ప్రధాన భారత సంతతి ప్రపంచ నేతలెవరో ఓ లుక్కేద్దామా..!
జో బైడెన్ ప్రభుత్వంలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా దేశ చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్ పూర్వీకులు తమిళనాడులో పుట్టి పెరిగారు. 2011-17 మధ్య కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గానూ కమలా హ్యారిస్ పని చేశారు.
మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్.. భారత సంతతి వారే. ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆయన పలు మంత్రివర్గాల్లో కీలక శాఖలు నిర్వహించారు. లా కేవరిన్లోని భారతీయ దంపతులకు జన్మించిన రాజకీయ నేతే ప్రవీన్ జుగ్నాథ్.
ప్రస్తుత పోర్చుగల్ ప్రధాని అంటోనియో కోస్టా..భారత సంతతి వారే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన పూర్వీకులు గోవాలో పుట్టి పెరిగారు.