China Fire Accident | చైనాలో ఘోర అగ్ని ప్రమాదం (China Fire Accident) సంభవించింది. షాంగ్జీ ప్రావిన్స్ (Shanxi province)లోని ఓ నగరంలో ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం..
లులియాంగ్ నగరం (Luliang city)లో బుధవారం ఉదయం 6:50 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. బొగ్గు గని సంస్థ కార్యాలయంలోని (coal company) రెండో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి మిగిలిన అంతస్తులకు వ్యాపించడంతో సుమారు 90 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపలున్న 26 మంది మరణించారు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Nana Patekar | సెల్ఫీ కోసం వచ్చిన యువకుడిని కొట్టడంతో విమర్శలు.. క్షమాపణలు కోరిన నానా పటేకర్
Satya Nadella | అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని మ్యాచ్ను ఎంజాయ్ చేశా : సత్యనాదెళ్ల