World Bank | కరోనా కష్టాల్లో ప్రపంచ బ్యాంక్ ఉద్యోగం పట్టాడీ కుర్రాడు.. నిజమైన హీరో అంటున్న నెటిజన్లు
World Bank | పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి కష్టమైనా సాధ్యమేనంటారు. ఇదే మాటను మరోసారి నిరూపించాడీ 23 ఏళ్ల కుర్రాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే సరికి ఏకంగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం పట్టేశాడీ
పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి కష్టమైనా సాధ్యమేనంటారు. ఇదే మాటను మరోసారి నిరూపించాడీ 23 ఏళ్ల కుర్రాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే సరికి ఏకంగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం పట్టేశాడీ ప్రఖ్యాత ‘యేల్ యూనివర్సిటీ’ గ్రాడ్యుయేట్. తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్టులో వత్సల్ నహతా తన కథను చెప్పుకున్నాడు. 2020 కరోనా సంక్షోభంలో వత్సల్ కథ మొదలైంది.
యేల్ వర్సిటీలో అతని గ్రాడ్యుయేషన్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుందనగా కరోనా మహమ్మారి ప్రపంచంపై తన పంజా విసిరింది. ‘నాకు ఉద్యోగం లేదు. రెండు నెలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తవుతుంది. కనీసం ఒక జాబ్ కూడా సంపాదించలేకపోతే యేల్కు వచ్చి ప్రయోజనం ఏంటి? అనిపించింది. ఇంటి నుంచి పేరెంట్స్ కాల్ చేస్తే వాళ్ల ముందు ధృడంగా ఉండటం కూడా కష్టం అయిపోయింది. అయినా సరే ఇక్కడే ఉండాలని, ఇంటికి వెళ్లడం ఆప్షన్ కాదని నిశ్చయించుకున్నా.
నా మొదటి పేచెక్ డాలర్లలో ఉండాలనేదే నా ఆశయం. ఈ సమయంలో జాబ్ అప్లికేషన్లు, జాబ్ పోర్టల్స్‌ను అస్పలు ఉపయోగించుకోలేదు. రెండు నెలల కాలంలో 1500 కనెక్షన్ రిక్వెస్టులు పంపా. 600 ఈమెయిల్స్ రాశా. 80 కాల్స్ చేశా. వీరిలో చాలా మంది రిజెక్ట్ చేసినవాళ్లే’ అని వత్సల్ పేర్కొన్నాడు. ఆ తర్వాత తన కష్టానికి ఫలితం కనిపించి నాలుగు కంపెనీలు తనకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించాడు.
‘నాకు వచ్చిన ఆఫర్లలో వరల్డ్ బ్యాంక్ ఆఫర్ తీసుకోవాలని డిసైడయ్యా. వాళ్లు నా ఓపీటీ అయిపోయిన తర్వాత వీసా ఇప్పించేందుకు కూడా అంగీకరించారు. అలాగే వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ డైరెక్టర్‌తో కలిసి మెషీన్ లెర్నింగ్‌పై అధ్యయనం చేసే అవకాశం ఇస్తానని నా మేనేజర్ చెప్పారు. ఒక 23 ఏళ్ల కుర్రాడికి ఇలాంటి అవకాశం రావడం ఇప్పటి వరకు జరగలేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఐవీ లీగ్ డిగ్రీ జీవితంలో కొంతవరకే సాయం చేస్తుందని చెప్పిన వత్సల్.. ‘ఎన్ని కష్టాలొచ్చినా, చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూలిపోతోందని అనిపించినా సరే ఓటమిని అంగీకరించవద్దు. నీ తప్పుల నుంచి నేర్చుకుంటూ.. సాధ్యమైనన్ని తలుపులు తడితే మంచి రోజులు అవే వస్తాయి. ఇది చెప్పడానికే నా కథ మీ ముందు ఉంచా’ అని రాశాడు. అతని జీవితం చాలా స్ఫూర్తిమంతంగా ఉందని, వత్సల్ ఒక నిజమైన హీరో అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ పోస్టుకు 15 వేలమందికిపైగా లైక్స్ ఇవ్వగా.. 100 మంది వరకూ షేర్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

