సియోల్: దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో (Muan Airport) ఘోర ప్రమాదం సంభవించింది. రన్‌వేపై దిగుతున్న విమానం అదుపుతప్పి గోడను ఢీకొట్టి పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 62 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సయమంలో విమానంలో 175 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా జతు ఎయిర్వేస్కు చెందిన 7సీ2216 విమానానికి ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రయాణికుల్లో 173 మంది దక్షిణ కొరియాకు చెందినవారు కాగా, ఇద్దరు థాయ్ జాతీయులని తెలిపారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కాగా, ఈ నెల 26న అజర్బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 40 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రయాణికులలో 37 మంది అజర్బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్థానీలు, ముగ్గురు కిర్గిస్థానీ పౌరులు ఉన్నారు. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయల్దేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గర్లో ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొనడంతో కుప్ప కూలి మంటలు చెలరేగాయి.
BREAKING: New video shows moment Boeing 737-800 plane carrying 181 people onboard crashes at Muan International Airport in South Korea.
pic.twitter.com/konxWBpnWy— AZ Intel (@AZ_Intel_) December 29, 2024
⚡️UPDATE: 23 casualties reported as rescue teams fight fire and smoke at Muan International Airport plane crash site in South Korea
Close-up photo shows remains of plane engulfed in flames pic.twitter.com/OV2TGoKV8j
— RT (@RT_com) December 29, 2024