విమానాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు. దానికి ప్రత్యేకంగా ట్రెయినింగ్ తీసుకోవాలి. పైలెట్స్ మాత్రమే విమానాన్ని నడపాలి. విమానం ముందు భాగంలో పైలెట్స్ కూర్చునే కాక్పీట్లోకి ఎవ్వరినీ అనుమతించరు కూడా. అటువంటిది 2 ఏళ్ల బుడతడు ఏకంగా పైలెట్ సీటులో కూర్చొని హల్ చల్ చేశాడు. అసలు.. ఆ విమానం కాక్పీట్లోకి 2 ఏళ్ల పిల్లోడిని ఎవరు పంపించారు. ఎందుకు పంపించారు.. అనే కదా మీ డౌట్. దాని వెనుక ఓ కారణం ఉంది.
ఎందుకంటే.. ఆ పిల్లాడికి విమానాలంటే పిచ్చి అట. చిన్నప్పటి నుంచి విమానాలంటే క్రేజీగా ఉన్న ఆ పిల్లాడిని విమానం సిబ్బంది కాక్పీట్లోకి తీసుకెళ్లి పైలెట్ సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత పక్కనే కూర్చున్న పైలెట్.. ఆ బుడ్డోడికి క్యాప్ పెట్టి.. విమానాన్ని ఎలా నడపాలో.. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి.. వావ్.. పిల్లోడి కల ఫలించింది. అంత చిన్న వయసులోనే పైలెట్ సీటులో కూర్చున్నాడంటే గ్రేట్. అ పిల్లోడిలో ఫ్యూచర్ పైలెట్ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.