Iran | ఐడీఎఫ్ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి.. ప్రకటించిన ఇరాన్
Iran | ఇరాన్ (Iran)పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్.. అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది.
Iran | ఇరాన్ (Iran)పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్.. అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడిన (Israeli Air Strikes) విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది.
కాగా, ఈనెల 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 మిసైల్స్‌ను టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసింది. తాజాగా ఇరాన్‌పై ఐడీఎఫ్ ఎదురుదాడులతో విరుచుకుపడింది. మరోవైపు తాజా దాడులపై ఇరాన్ స్పందించింది. మూడు సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పరిమితి స్థాయిలో మాత్రమే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ ప్రకటన చేసింది.
విమాన రాకపోకలు రద్దు
మరోవైపు ఐడీఎఫ్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేసింది (cancels all flights). పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జాఫర్ యాజర్లౌ వెల్లడించారు. అన్ని మార్గాల్లోని విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
అందుకే ఎదురుదాడులు : ఐడీఎఫ్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ తరచూ దాడులకు దిగుతున్నది, ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఐడీఎఫ్ దాని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉందన్నారు. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేశారు.
Also Read..
Iran | ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల వేళ.. అన్ని విమానాలను రద్దు చేసిన ఇరాన్
Israel | సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
The Mukaab | సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. నిర్మాణ వ్యయం ఎంతంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

