జెరూసలెం, జూన్ 22: ఆపరేషన్ సింధూలో భాగంగా చేపట్టిన పౌరుల తరలింపు సంయుక్త ఆపరేషన్లో ఇజ్రాయెల్, జోర్డాన్ల నుంచి ఆదివారం మొదటి విడతగా 160 మంది భారతీయులను సురక్షితంగా భారత్కు తరలించారు. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో తొలివిడతగా 160 మంది మన పౌరులను భూ మార్గం ద్వారా సరిహద్దు దాటించి జోర్డాన్కు చేర్చారు.
అక్కడ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు జరిపిన తర్వాత వారిని అమ్మన్ విమానాశ్రయానికి తరలించారు. వారిని సురక్షితంగా తీసుకురావడానికి అమ్మన్ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్టు భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇరాన్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మరో 311 మంది భారతీయులు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతోభారత్ చేరుకున్న పౌరుల సంఖ్య 1,428కి చేరింది.