రష్యా గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు.. 16 మంది మృతి

మాస్కో: రష్యాలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మాస్కోకు ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలోని రియాజాన్ ప్రాంతంలో ఉన్న ఎలాస్టిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు జరిగినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలుత ఏడుగురు మరణించారని, తొమ్మిది మంది మిస్సింగ్‌గా ప్రకటించింది. అనంతరం వారు కూడా చనిపోయినట్లు పేర్కొంది. కాగా, తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఉత్పత్తి ప్రక్రియలో వైఫల్యం కారణంగా గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని ఆ దేశ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వివరించింది. మంటలను అదుపు చేసేందుకు 170 మంది ఎమర్జెన్సీ సిబ్బంది, 50 వాహనాలు పాల్గొన్నాయని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

