train derails in Pakistan | పాకిస్థాన్లో పట్టాలు తప్పిన రైలు.. 22 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు
train derails in Pakistan | ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.
ఇస్లామాబాద్: ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్, షాజాద్పూర్- నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆ రైలులోని 10 బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను నవాబ్షాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Pak Train Accident
కాగా, రైలు ప్రమాదంపై స్థానికులు వెంటనే స్పందించారు. పట్టాలు తప్పిన రైలు బోగీల్లోని ప్రయాణికులను బయటకు తీశారు. పలువురిని కాపాడారు. ధ్వంసమైన బోగిల్లో పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు పాకిస్థాన్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

