UK Scholarship | లండన్: ఇంగ్లండ్‌లో పీజీ చేయాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు రూ.10 లక్షల స్కాలర్షిప్ ఇస్తామని స్థానిక స్ట్రాత్‌ైక్లెడ్ యూనివర్సిటీ ప్రకటించింది. మలేషియా, థాయ్‌ల్యాండ్ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఇంజినీరింగ్ విభాగంలో ఒక ఏడాది పీజీ కోర్సులో చేరే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తామని తెలిపింది. దరఖాస్తుదారులకు భారత్, మలేషియా, థాయ్‌ల్యాండ్ దేశాల పాస్‌పోర్టు ఉండాలని, మే 3వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని పేర్కొన్నది.