Turkey Earthquake | 90 గంటలు శిథిలాల కిందే పది రోజుల శిశువు.. సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది
శిథిలాల కింద చిక్కుకుని 90 గంటల పాటు మృత్యువుతో పోరాడిన పదిరోజుల పసికందు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుని సజీవంగా ఉన్న ఆ శిశువును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశారు.
Turkey Earthquake | తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర విపత్తులో సుమారు 25 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. శిథిలాల కింద వేలమంది చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తు్న్నారు. శిథిలాల కింద చిక్కుకుని 90 గంటల పాటు మృత్యువుతో పోరాడిన పదిరోజుల పసికందు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుని సజీవంగా ఉన్న ఆ శిశువును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశారు.
హతయ్ ప్రావిన్సులో భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గడ్డకట్టే చలిలోనూ నిరంతరం శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిబ్బందికి శిథిలాల కింద పది రోజుల వయసు గల శిశువు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. చిన్నారిని ఓ థర్మల్ దుబ్బటిలో చుట్టి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిశువు తల్లిని సైతం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Yağız Ulaş bebek sadece 10 günlük. Depremden 90 saat sonra Hatay Samandağ’da annesi ile birlikte enkazdan çıkarıldı. pic.twitter.com/7jjjEXQfiV
— Ekrem İmamoğlu (@ekrem_imamoglu) February 9, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

