Shooting in US | అమెరికాలో దుండగుల కాల్పుల మోత మోగుతున్నది. సోమవారం దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ షికాగో సబర్బన్ ప్రాంతంలో సాయుధ దుండగుడి కాల్పుల ఘటన విషాదచ్చాయలు వీడక ముందే మంగళవారం మరో ఘటన చోటు చేసుకున్నది. నార్త్ వెస్ట్ ఇండియానాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించాయి. కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలిస్తున్నాయి.
ఇదిలా ఉంటే సోమవారం షికాగో సబర్బన్ ప్రాంతంలోని ఒక పరేడ్‌పై సాయుధుడు కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు మృతి చెందగా, 37 మందికి గాయాలయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ ప్రారంభం కాగానే, దాని సమీపంలోని భవనంపై నుంచి కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.