Viral News | 50వ వార్షికోత్సవం.. భార్యకు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా 12 లక్షల పొద్దుతిరుగుడు పువ్వులు ఇచ్చిన రైతు
Viral News | పెళ్లి రోజు సందర్భంగా తమ జీవిత భాగస్వామికి అందమైన, ఎప్పటికీ గుర్తిండిపోయే బహుతులు ఇస్తుంటారు. తాజాగా ఓ రైతు ( US Farmer) మాత్రం 50వ వార్షికోత్సవం (50th Anniversary) సందర్భంగా తన భార్యకు ఎవరూ ఊహించని బహుమతిని అందించాడు. ఇంతకీ అతను ఏమి ఇచ్చాడో తెలిస్తే.. ఆ వ్యక్తికి తన భార్య పై ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది.
Viral News | పెళ్లి రోజు సందర్భంగా తమ జీవిత భాగస్వామికి అందమైన, ఎప్పటికీ గుర్తిండిపోయే బహుతులు ఇస్తుంటారు. ప్రత్యేకమైన రోజున బట్టలో, బంగారమో, ఫోన్లో ఇలా ఏదో ఒకటి తమ స్తోమతకు తగ్గ బహుమతిని ఎంతో ప్రేమతో ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ రైతు ( US Farmer) మాత్రం 50వ వార్షికోత్సవం (50th Anniversary) సందర్భంగా తన భార్యకు ఎవరూ ఊహించని బహుమతిని అందించాడు. ఇంతకీ అతను ఏమి ఇచ్చాడో తెలిస్తే.. ఆ వ్యక్తికి తన భార్య పై ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది.
అమెరికాకు చెందిన రైతు లీ విల్సన్ (Lee Wilson), అతని భార్య రెనీ (Renee)ఆగస్టు 10వ తేదీన 50వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. పెళ్లి రోజు సందర్భంగా లీ తన జీవిత భాగస్వామికి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి అందించాలనుకున్నాడు. రెనీకి పొద్దు తిరుగుడు పువ్వులంటే (Sunflowers) భలే ఇష్టం. దీంతో విల్సన్ తన కుమారుడి సాయంతో సుమారు 80 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పువ్వులను పెంచాడు. మే నెలలో వాటిని పెంచడం మొదలు పెట్టాడు. తోట వేసిన విషయాన్ని భార్యకు తెలియకుండా రహస్యంగా ఉంచాడు. అవి పూర్తిగా వికసించాకా తన భార్యను తోటకు తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేశాడు. మొత్తం 80 ఎకరాల్లో పంట వేయగా.. ఎకరాకు 15 వేల పువ్వులు వికసించాయి. అంటే మొత్తం 12 లక్షల పువ్వులను తన భార్యకు బహుతిగా అందించాడన్న మాట.
భర్త ఇచ్చిన గిఫ్ట్ తో రెనీ ఉబ్బితబ్బిబైపోయింది. ఇది తనకు చాలా ప్రత్యేకంగా అనిపించిందని తెలిపింది. ‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఇంత కంటే గొప్ప వార్షికోత్సవ బహుమతి ఏముంటుంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.
Also Read..
Cheetah | మరో చీతా మృతి.. ఐదు నెలల్లో తొమ్మిదో మరణం
Manipur Violence | మణిపూర్ అల్లర్లు.. మూడు నెలల్లో 30 మంది అదృశ్యం..!
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

