హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్‌లో (Langar house)దారుణ హత్య జరిగింది. పిల్లర్ నంబర్ 96 వద్ద దుండగులు ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాలవల్ల జరిగిందా అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.