MMTS Train | ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం..
రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒకమూలన లైంగికదాడి ఘటలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు బోగీలో (MMTS Train) ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. అతన్ని ప్రతిఘటించిన బాధితురాలు కదులుతున్న రైలులో నుంచి కిందికి దూకేసింది.
MMTS Train | హైదరాబాద్: రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒకమూలన లైంగికదాడి ఘటలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు బోగీలో (MMTS Train) ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. అతన్ని ప్రతిఘటించిన బాధితురాలు కదులుతున్న రైలులో నుంచి కిందికి దూకేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో మేడ్చల్‌కు బయలుదేరింది. మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ దిగిపోయారు. దీంతో బోగీలో ఆమె ఒక్కతే అయిపోయింది. గుర్తించిన ఓ యువకుడు (25) ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. దీంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు కొంపల్లి సమీపంలో రైలు నుంచి బయటకు దూకింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతిని గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

