ఖైరతాబాద్, ఆగస్టు 2 : హిజాబ్ ధరించిన యువతి, మరో యువకుడిపై అకారణంగా దాడి చేసి కొట్టడమే కాకుండా వారి వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టాచేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీసీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు.
గత నెల 29న ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐటీ ఉద్యోగి అయిన నీరజ్ (24) విధులు ముగించుకొని సహ ఉద్యోగిని అయిన ముస్లిం యువతితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. వారిని గమనించిన చార్మినార్ షాకర్గంజ్కు చెందిన మహ్మద్ రహీల్ (24) బైక్‌ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆ యువతి హిజాబ్ ధరించి ఉంది. ఆ ఇద్దరిపై మతపరమైన వ్యాఖ్యలతో దుర్షాలాడుతూ విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా కొట్టాడు. అంతేకాకుండా తన సెల్ ఫోన్లో ఇద్దరి వీడియోలు చిత్రీకరిం చాడు.
వారు భయంతో బైక్‌పై హిమాయత్‌నగర్ వైపునకు పారిపోగా, వారిని వెంబడిస్తూ వీడియోను చిత్రీకరిస్తూ భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ వీడియోల ను మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా మతపరమైన వ్యాఖ్యలు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు నిందితుడు మహ్మద్ రహీల్‌ను చార్మినార్ వద్ద అరెస్ట్ చేసి, అతని నుంచి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీ నం చేసుకున్నారు. సమావేశంలో సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీసీ ఆనంద్, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్, ఎస్‌హెచ్‌వో రాజేందర్, డీఐ బాలరాజు, ఎస్సైలు నవీన్, శంకర్, పరమేశ్వరి పాల్గొన్నారు.