సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): ఆసియా – పసిఫిక్ గ్రామీణ వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్, థాయ్‌లాండ్.. అంతర్జాతీయ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ అసోసియేషన్ సహకారంతో ఎన్ ఈ డీ ఏ సీ (ది నెట్వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఇన్ ఏసియా అండ్ పసిఫిక్) వర్కషాప్ నిర్వహించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ‘వ్యవసాయ సహకార సంఘాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు.. పెట్టుబడుల’ సాధనకు ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వర్కషాప్లో నాఫ్సో చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ప్రెసిడెంట్ కొండూరు రవీందర్ రావు, టెస్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నేతి మురళీధర్, టెస్కా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఐసీబీఏ చైర్మన్ భీమా సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ శ్రీకృష్ణ, ఆర్.సలిన్మరియు ఏపీఆర్‌ఏసీఏ, థాయ్‌లాండ్ సెక్రటరీ జనరల్ ప్రసూన్ కుమార్ దాస్ పాల్గొన్నారు.