Bandi Sai Bageerath | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నం చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైంది.
ఈ వ్యవహారంలో అమ్మాయి కుటుంబంపై నెపం నెట్టడంతోపాటు సదరు కుటుంబమే బ్లాక్మెయిల్ చేసిందని చిత్రీకరించడానికి సాయి భగీరథ్ చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలిక కుటుంబం ఈ నెల 9న పేట్ బషీరాబాద్ స్టేషన్లో బండి సాయి భగీరథ్‌పై పలు ఆధారాలతో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. దాదాపు ఆరు గంటల డ్రామా తర్వాత తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారంతా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. కేసు నమోదైన మూడు రోజులకు కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బండి సంజయ్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ..మైనర్ బాలికకు ప్రభుత్వ అండగా ఉండాలని డిమాండ్ చేశారు.

TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?