భర్తను హత్య చేసిన భార్య అరెస్టు
బోడుప్పల్లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుడి భార్య, కొడుకుతోపాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బండారి అంజయ్య(57) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
- సహకరించిన కొడుకు మరో వ్యక్తికి రిమాండ్
పీర్జాదిగూడ, నవంబర్ 29: బోడుప్పల్లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటనలో మృతుడి భార్య, కొడుకుతోపాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బండారి అంజయ్య(57) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అంజయ్య రోజూ తాగొచ్చి భార్యను కొట్టడంతోపాటు పిల్లలతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య బుగ్గమ్మ(50), కుమారుడు రాజు(26)లు అంజయ్యను కలిసి హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
గురువారం రాత్రి సమయంలో డ్యూటీకి వెళ్లి వచ్చిన అంజయ్య రోజూ మాదిరిగా భార్య పిల్లలతో గొడవకు దిగాడు. రాత్రి పడుకున్నది చూసి ఇదే అదనుగా భావించి పథకం ప్రకారం వెంటనే ఇంట్లో ఉన్న తన మేనల్లుడు శ్యామల శేఖర్(32) సహాయంతో మృతుడి భార్య, కొడుకులు కలిసి నిద్రలో ఉన్న అంజయ్య మెడకు టవల్‌తో బిగించి హత్య చేశారు. అనంతరం ఉదయం భార్య, కొడుకు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ముగ్గురూ కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో శనివారం మృతికి కారణమైన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

