Plum Cake For Christmas | క్రిస్మస్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారా? హైదరాబాద్‌లో బెస్ట్ ప్లమ్ కేక్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
క్రిస్మస్ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారా? | అక్కడ కేక్స్, పాస్ట్రీస్, కుకీస్, స్నాక్స్, చీజ్‌కేక్, మఫ్ఫిన్స్ చాలా ఫేమస్. ఇక్కడ దొరికే ప్లమ్ కేక్ కోసం నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
క్రిస్మస్ సందడి అప్పుడే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా.. క్రిస్మస్ సెలబ్రేషన్సే. క్రిస్మస్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది క్రిస్మస్ పార్టీ. కేక్ కటింగ్స్. అవును.. ముఖ్యంగా క్రిస్మస్ పార్టీల్లో మనకు కనిపించేది ప్లమ్ కేక్(Plum Cake For Christmas). దాన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే.. టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ కావాలంటే ఎలా? ఎక్కడ దొరుకుతుంది. హైదరాబాద్‌లో క్రిస్మస్ పార్టీ కోసం బెస్ట్ ప్లమ్‌కేక్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందాం రండి.

కరాచీ బేకరీ – Karachi Bakery
కరాచీ బేకరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో కరాచీ బేకరీకి ఉన్న డిమాండ్ ఇంకా దేనికీ ఉండదు. కరాచీ బేకరీలో బిస్కెట్లు కొనుక్కొని తిన్నా చాలు.. అదో సంతృప్తి. అక్కడ దొరికే బేకరీ ఐటెమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్మస్ పార్టీల కోసం కరాచీ బేకరీ ప్రత్యేకంగా ప్లమ్ కేకులను తయారు చేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కరాచీ బేకరీకి సంబంధించిన 15 స్టోర్లు ఉన్నాయి. వాటిలో ఏ స్టోర్‌కు అయినా వెళ్లి ప్లమ్ కేక్‌ను కొనుక్కోవచ్చు.
గోల్డెన్ బేకరీ – Golden Bakery
75 ఏళ్ల కింద గోల్డెన్ బేకరీని ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్‌లో ఉంటుంది. అక్కడ కేక్స్, పాస్ట్రీస్, కుకీస్, స్నాక్స్, చీజ్‌కేక్, మఫ్ఫిన్స్ చాలా ఫేమస్. ఇక్కడ దొరికే ప్లమ్ కేక్ కోసం నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.

శుభాన్ బేకరీ – Subhan Bakery
శుభాన్ బేకరీ.. నాంపల్లిలో ఉంది. గత 60 ఏళ్ల నుంచి ఈ బేకరీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సమయంలో.. ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసే స్పెషల్ బ్రెడ్, కుకీస్, ట్రెడిషనల్ ప్లమ్ కేక్స్ చాలా ఫేమస్. అలాగే.. డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్‌ను కూడా ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
Trio-La Pâtisserie
ప్లమ్ కేక్స్, రమ్ కేక్స్, బ్రెడ్.. లాంటి స్పెషల్ కేక్స్ కావాలంటే.. సికింద్రాబాద్‌లో ఉన్న Trio-La Pâtisserie కు వెళ్లాల్సిందే. క్రిస్మస్ సీజన్లోనే అంటే నవంబర్ నుంచి జనవరి వరకు ఈ బేకరీలో ప్లమ్ కేక్స్‌ను స్పెషల్‌గా తయారు చేస్తారు.
Cafe Eclat
కేఫ్ ఎక్లాట్.. గచ్చిబౌలిలో ఉంది. క్రిస్మస్ వచ్చిందంటే చాలు.. గచ్చిబౌలిలో ఉండే సందడే వేరు. ఈ బేకరీలో క్రిస్మస్ పార్టీల కోసం ప్లమ్కేక్ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వైన్, ఫ్రూట్స్, ఎగ్స్, బటర్‌తో తయారుచేసే స్పెషల్ ప్లమ్ కేక్ కోసం జనాలు ఎగబడతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ముట్టుకోకుంటే.. అంటుకోదు
రూల్స్ తెలిస్తే సరిపోదు.. భద్రంగా నడపాలి
తండ్రికి తోడుగా..చదువులకు చేదోడుగా
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

