CPI Narayana | పోక్సో కేసు నిందితుడైన నా కొడుకు అరెస్ట్ కాలేదు.. లొంగిపోయాడన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ తనదైన శైలిలో స్పందించారు. బండి సాయి భగీరథ్‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.. నేనే పోలీస్ స్టేషన్‌కు పంపించానని బండి సంజయ్ అంటున్నాడు. దీంతో పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైందని సీపీఐ నేత నారాయణ అన్నారు.
బండి సాయి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంతో బండి సంజయ్ ముద్దాయి అయ్యాడు.. కోర్టు అసమర్థత బయటపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై నారాయణమీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు బండి సాయి భగీరథ్ మీద POCSO కేసు పెట్టినప్పుడు అతనిని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని ఫైర్ అయ్యారు.
ఎవరెవరినో ఎన్ కౌంటర్ చేశారని.. ఇతనిని ఎన్కౌంటర్ చేయమని చెప్పడం లేదు, కనీసం అరెస్ట్ కూడా చేయలేదని వాపోయారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
బండి భగీరధ్‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు
నేనే పోలీస్ స్టేషన్‌కు పంపించానని బండి సంజయ్ అంటున్నాడు
దీంతో పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది.. బండి సంజయ్ ముద్దాయి అయ్యాడు.. కోర్టు అసమర్థత బయటపడింది
నిందితుడు బండి భగీరధ్ మీద POCSO కేసు పెట్టినప్పుడు అతనిని అరెస్ట్… https://t.co/Z4MwE05gT6 pic.twitter.com/fF3U2h86pn
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026