దుండిగల్, డిసెంబర్ 31: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్, కమిషనర్ వంశీకృష్ణతో కలిసి ఆయన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాం తాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా సింహపురి కాలనీలో రూ.1.8కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 1 మిలియన్ లీటర్ల వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను, బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వద్ద రూ.10కోట్లతో చేపడుతున్న 6 మిలియన్ లీటర్ల నీటిస్టోరేజ్ ట్యాంక్ పనులు, నిజాంపేట్‌లో జరుగుతున్న ఎస్ఎన్డీపీ నాలా నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
అదే సమయం లో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన కాలనీల్లో మంచినీటి పైప్లైన్లు వేయడంతో పాటు తాగునీటి కనెక్షన్లు అందించి నీటిసరఫరాను మెరుగుపరచాలన్నారు. నాలా నిర్మాణ పనులను సైతం రానున్న రెండు నెలలకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సదుపా యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ, ఎస్ఎన్డీపీ అధికారులు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, అనుబంధ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జర్నలిస్టు కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం…
నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. ప్రధానంగా చెర్ల ఎల్లమ్మ ఆలయానికి వెళ్లేందుకు శ్రీచైతన్య కళాశాల వెనుకనుంచి రహదారి నిర్మించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీవాసులు ముక్కర్ల లాలయ్య, వెంకట్ పాల్గొన్నారు.