Thummala Nageswara Rao | వెంగళరావునగర్, జనవరి 26: చేనేత కళాకారులకు ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని, ప్రతి ఒక్కరు చేనేత వస్ర్తాలను ధరించి చేనేత కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత ఉత్పత్తుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించి, సిల్క్ మార్క్‌తో నాణ్యమైన వస్ర్తాలను తక్కువ ధరలకే అందిస్తున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ వినియోగదారులకు అందిస్తున్న నిర్వాహకులు శ్రీనివాసరావు కృషిని అభినందించారు.
ఇలాంటి వస్త్ర ప్రదర్శనల ద్వారా చేనేతకారులకు చేయూతను, వారి ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరువ అవుతాయని అన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను సుమారు 80 స్టాల్స్ లో ఏర్పాటు చేశామని సిల్క్ ఇండియా సీఈఓ వినయ్ తెలిపారు. చెందేరి, ఇక్కత్, నారాయణ పేట్, బెనారస్, కోల్‌కతాకు చెందిన విభిన్నమైన అరుదైన చీరలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్టై్సల్స్ ఎన్విరాన్మెంట్స్ డైరెక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.