Footpath Shops | రేవంత్ రెడ్డి వచ్చినంక నిద్ర కూడా రానంత భయమేస్తుంది.. చిరు వ్యాపారి ఆవేదన
Footpath Shops | షాపుల యజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా అధికారులు కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఉపాధి కరువై దిక్కు తోచని స్థితిలో రోడ్డున పడుతున్నారు.
Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో మల్కాజ్‌గిరిలో బుల్డోజర్లతో రంగంలోకి దిగి ఫుట్‌పాత్‌పై ఉన్న చిరు వ్యాపారుల షాపులు తొలగించారని తెలిసిందే. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు. షాపుల యజమానులు సామాన్లు సర్దుకునే సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా అధికారులు కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఉపాధి కరువై దిక్కు తోచని స్థితిలో రోడ్డున పడుతున్నారు.
బుల్డోజర్ల దౌర్జన్యంలో షాపు కోల్పోయిన ఓ చిరు వ్యాపారి మాట్లాడుతూ.. మాకు చాయ్ బండీ, చిన్న పాన్ డబ్బా స్టాల్ ఉంది. మా బతుకే షాపు మీద.. ఇప్పుడు మొత్తమే తొలగిస్తా అంటే భయం రాదా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుబాబ్తో బతుకుమని సపోర్ట్ ఇస్తుండే.. కానీ రేవంత్ రెడ్డి నుంచి ఒక సపోర్ట్ లేదు.. ఆశ లేదు. జీవితంలో మంచిగా బతికితే కూడా తప్పు. ఏం చేస్తుండో ఏమో ఆయనకన్నా అర్థమవుతుందో లేదో..? ఇల్లు అద్దెకే ఉంటున్నం. సొంతం ఏం లేదు. రోడ్డు మీద బతుకుతుంటే మొత్తం రోడ్డు మీదికి తెచ్చిండు.
రేవంత్ రెడ్డి వచ్చినంక నిద్ర కూడా వస్తలేదు.. అంత భయమేస్తుంది. అసలు బతుకనిస్తలేడు. మాకు టైం కూడా ఇవ్వకుండా సడెన్‌గా వచ్చి సామాన్లు తొలగించి షాపులను తీసేసిండ్రు. కనీసం మాటా లేదు. ఏం లేదు.. కాళ్లు పట్టుకుంటే కూడా వింటలేరు. ఏం చేయాలో చెప్పండి అని ఆవేదన వ్యక్తం చేశాడు.
పేదోడు బతికితే రేవంత్ రెడ్డికి మంచిగ అనిపిస్తలేదు
రేవంత్ రెడ్డి పేద ప్రజలను తెలంగాణలో బతకనిచ్చేలా లేడు
ఎప్పుడు ఎక్కడ కులగొడ్తాడో అని భయంతో బతుకుతున్నాము
కనీసం మా సామాన్లు తీసుకునే టైమ్ ఇవ్వండి అని కాళ్లు పట్టుకున్నా వినడంలేదు https://t.co/prFBGcX27L pic.twitter.com/2iBkR1MDdD
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026
Read Also :
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

