GHMC Water | సిటీబ్యూరో: జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ 8, 15 పరిధిలోని లింగంపల్లి , పటాన్చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి.
ఈ నేపథ్యంలో ఓ అండ్ ఎం డివిజన్ నం 8, 15 పరిధిలోని పటాన్చెరు, ఆర్సీ పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట్, డోమెన్స్ కాలనీ, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, టౌన్షిప్, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.