Mahindra Showroom | హైదరాబాద్(తెలంగాణ) మే 7 : ప్రముఖ కార్ డీలర్ వీవీసీ మోటార్స్ హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో నూతన మహీంద్రా షోరూమ్‌ను ప్రారంభించింది. దాదాపు 6500 చదరపు అడుగల విస్తీర్ణంతో అతి విశాలమైన ఈ షోరూమ్‌ను వీవీసీ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీవీ రాజేంద్రప్రసాద్, వీవీసీ మహీంద్రా షోరూమ్ సీఈవో వీరేన్ చౌదరి ప్రారంభించారు. అలాగే ఎల్బీనగర్లోని జిల్లెల్లగూడలో అతి పెద్ద సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేశారు.
ఈ సందర్భంగా వీవీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఓల్డ్బోయిన్పల్లిలో అత్యంత విశాలమైన షోరూమ్, జిల్లెల్లగూడలో అధునాతన సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ షోరూమ్ గ్రాండ్ లాంచ్ కూడా ఈ నెలలోనే ఉంటుందని తెలిపారు. ఇక్కడి బాడీ షాప్‌లో ఒకే సమయంలో 18 కార్లను సర్వీస్ చేసి ఇవ్వగలమని పేర్కొన్నారు. ఇప్పటికే, తమకు హైదరాబాద్‌లోని కొత్తగూడ, హైటెక్ సిటీ, ఈసీఐఎల్, కూకట్‌పల్లిలో అత్యాధునిక సెర్వీస్ సెంటర్స్ ఉన్నాయని ఇప్పుడు కొత్తగా ఎల్బీ నగర్‌లోని జిల్లెలగూడలో కూడా స్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. బాచుపల్లిలో కూడా సెర్వీస్ సెంటర్ ఉందని తెలిపారు.
కొత్తగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్, అత్తాపూర్, ఘట్కేసర్, నాచారం, ఈసీఐఎల్, ఎల్బీనగర్, మలక్‌పేట్, హిమాయత్ నగర్, సనత్ నగర్, కొంపల్లి, బాచుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లిలో తమకు షోరూమ్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఓల్డ్ బోయిన్ పల్లిలో కొత్త షోరూమ్‌ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా థార్ కార్‌ను ఫస్ట్ డెలివరీ ఇచ్చారు.