వినోద్‌కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకుడు. రాకేష్ వర్రే నిర్మాత. ఈ నెల 19న విడుదల కానుంది. డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడతూ ‘మహిళా సాధికారత ప్రధాన అంశంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సమాజానికి చక్కటి సందేశం ఉంటుంది. ఇటీవల వేసిన పెయిడ్ ప్రీమియర్స్‌కు మంచి స్పందన లభించింది’ అన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యువతకు కూడా కనెక్ట్ అయ్యే కథ ఇదని నిర్మాత రాకేష్ వర్రే తెలిపారు. సందేశాత్మక కథలో భాగం కావడం ఆనందంగా ఉందని నాయకానాయికలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి స్మరణ్‌సాయి సంగీతాన్నందిస్తున్నాడు.