మెడికల్ అధికారులేరీ?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ) అత్యంత కీలకమైన మెడికల్ అధికారి పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
- యూపీహెచ్‌సీల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీ
- ఖాళీలు ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా భర్తీ చేయని రాష్ట్ర సర్కార్
- పేదలకు తప్పని అవస్థలు
సిటీబ్యూరో, మే 31,(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్యకేంద్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వెనుకడుగు వేస్తున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ) అత్యంత కీలకమైన మెడికల్ అధికారి పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాడి పట్టే వైద్యులు లేక పేదలకు నానా అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నవారే అదనపు సెంటర్లలో వైద్యసేవలందిస్తున్నారు. మరికొన్ని కేంద్రాల్లో ఏఎన్ఎంలే చికిత్సనందిస్తుండటం గమనార్హం.
భర్తీకి సిద్ధంగా 40 ఖాళీలు..
పేదవాడికి జబ్బుచేస్తే వెంటనే గుర్తుకొచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. కేసీఆర్ పాలనలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలు సైతం ఏర్పాటు చేసి పేదవాడి ఇంటి ముందే ఉచిత వైద్యం చేరవేశారు. జిల్లాలోని బస్తీవాసులు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నిరంతరం నాణ్యమైన వైద్యసేవలందించాయి. కానీ నేడు అవన్నీ సిబ్బంది కొరతతో స్వాగతం పలుకుతున్నాయి.
హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో మొత్తం 85 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో కేవలం 45 మంది మెడికల్ అధికారులే ఉండటం గమనార్హం. ఎనిమిది నెలల కిందట జరిగిన బదిలీల్లో హైదరాబాద్ జిల్లాలోని 40 మంది మెడికల్ అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇక్కడి నుంచి బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్ బదిలీ కారణంగా ఏర్పడ్డ ఖాళీలను నింపడంలో నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నది.
ఈ కారణంగా ప్రస్తుతం ఒక్కో మెడికల్ అధికారి వారంలో మూడురోజులు విధులు నిర్వహిస్తున్న కేంద్రంలో, మరో మూడు రోజులు మెడికల్ అధికారి లేని సెంటర్‌కు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. దీని కారణంగా మెడికల్ అధికారులు అధిక పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి యూపీహెచ్‌సీలో కనీసం ఒక మెడికల్ అధికారి, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నిషియన్, ఏఎన్ఎంలు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ జిల్లాలో కీలకమైన మెడికల్ అధికారి పోస్టులే ఖాళీగా ఉన్నాయి.
పర్యవేక్షణ కరువైంది..
రోగి ఆరోగ్య పర్యవేక్షణలో మెడికల్ అధికారి పాత్ర కీలకం. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, సాధారణ జ్వరం నుంచి వ్యాధి నిర్ధారణ వరకు పలు సమస్యలకు మందులు సూచించడం, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం, చిన్న చిన్న గాయాలకు చికిత్సలందించడం, పోషకాహారం, వ్యాధి నివారణపై సలహాలు అందించడంతో పాటు ఇతర సిబ్బందిని ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సంబంధిత సెంటర్లో మెడికల్ అధికారి పోస్టు ఖాళీగా ఉండటం వల్ల ఆ సెంటర్లో సరైన పర్యవేక్షణ కూడా కరవైపోతున్నది.
రోగాలబారిన పడి వైద్య పరీక్షల కోసమని యూపీహెచ్‌సీలకు వచ్చే రోగులు మెడికల్ అధికారి లేకపోవడంతో సరైన వైద్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ఏఎన్ఎంలు ఇచ్చే మాత్రలు తీసుకొని నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సిన రాష్ట్ర సర్కార్ నేటికి చర్యలు చేపట్టని కారణంగా పేదవాడు ప్రభుత్వ వైద్యమంటే వెనకడుగు వేస్తున్న వైనం నెలకొంది. తమ ప్రాంతంలో ఉన్న యూపీహెచ్‌సీలో ఖాళీలను భర్తీ చేయాలంటూ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

