హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) ఎల్బీ నగర్ (LB Nagar) సాగర్ రింగ్‌రోడ్డులో (Sagar Ring road) చేపట్టిన ఫ్లై ఓవర్ (Flyover) నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరామల్‌గూడ (Biramalguda) ఫ్లై ఓవర్ ర్యాంపు కుప్పకూలింది (Collapse). దీంతో పది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వారంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని వెల్లడించారు. పిల్లర్లపై భారీ ఇనుప వంతెనను సెట్ చేస్తుండగా జారిపడిందని చెప్పారు.
కాగా, అర్ధరాత్రివేళ ప్రమాదం జరగడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాద స్థలాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఇంజినీర్ల బృందం.. ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.